V Srinivas Goud: గుర్రంపై తెలంగాణ మంత్రి సవారీ... ఫొటోలు ఇవిగో!

Telangana minister Srinivas Goud attends sunday funday program
  • మహబూబ్ నగర్ లో పర్యటించిన శ్రీనివాస్ గౌడ్
  • మినీ టాంక్ బండ్ పై సండే ఫన్ డే
  • హాజరైన మంత్రి
  • డాగ్ షోను ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ క్రీడలు, టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ లోని మినీ టాంక్ బండ్ వద్ద సండే ఫన్ డే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గుర్రంపై విహరించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తన పర్యటనలో భాగంగా పట్టణంలోని జడ్పీ గ్రౌండ్ లో డాగ్ షోను ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లోనూ మంత్రి పాల్గొన్నారు. అంతేకాదు, స్థానిక శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు.
V Srinivas Goud
Horse Riding
Sunday Funday
Mahabubnagar

More Telugu News