'మా' ఎన్నికల్లో తొలి ఫలితం... ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో ఇద్దరి గెలుపు

10-10-2021 Sun 19:14
  • కొనసాగుతున్న 'మా' ఓట్ల కౌంటింగ్
  • శివారెడ్డి, కౌశిక్ విజయం
  • ఇరువురు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ వర్గీయులే!
  • అనసూయ, సురేశ్ కొండేటి ముందంజ
MAA Elections results

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న'మా' ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో ఇద్దరు గెలుపొందారు. 'మా కార్యకర్గ సభ్యులుగా పోటీపడిన శివారెడ్డి, కౌశిక్ లు విజేతలుగా నిలిచారు. ఈ ఫలితంతో ప్రకాశ్ రాజ్ వర్గంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. అంతేకాదు, వారి సంతోషం ఇనుమడింపజేసేలా అనసూయ, సురేశ్ కొండేటి ఓట్ల లెక్కింపులో ముందంజలో కొనసాగుతున్నారు. వీరిద్దరూ కూడా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందినవారే.