ఈ నెల 12 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

10-10-2021 Sun 17:02
  • సొంత నియోజకవర్గంలో పర్యటించనున్న చంద్రబాబు
  • మూడ్రోజుల పాటు సాగనున్న పర్యటన
  • ఈ నెల 12న కుప్పంలో బహిరంగ సభ
  • పలుచోట్ల రోడ్ షోలు
Chandrababu will tour in Kuppam constituency

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. మూడ్రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. చంద్రబాబు ఈ నెల 12, 13, 14 తేదీల్లో కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 12న కుప్పంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటన సాగనుంది. రామకుప్పం మండలంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 14న కుప్పం గ్రామీణ మండలం, గుడుపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారైంది.