Samantha: "నాకు డబ్బు వద్దులే"... ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో సమంత

Samantha attends Evaru Meelo Koteeswarulu
  • జెమినీ టీవీలో 'ఎవరు మీలో కోటీశ్వరులు'
  • నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ కు గెస్టుగా సమంత
  • సోమవారం నుంచి గురువారం వరకు షో
  • రాత్రి 8.30 గంటలకు ప్రారంభం

జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న గేమ్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమానికి అందాల నటి సమంత వస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోను జెమినీ టీవీ విడుదల చేసింది. ఈ ప్రోగ్రాంకు "ఎవరు మీలో కోటీశ్వరులు నవరాత్రి స్పెషల్ విత్ సమంత" అని పేరుపెట్టింది.

ఇక ప్రోమో విషయానికొస్తే... సీట్లో కూర్చుంటే భయంగా ఉంది అని సమంత పేర్కొనగా, ఉంటుంది అంటూ ఎన్టీఆర్ తనదైన శైలిలో బదులివ్వడం చూడొచ్చు. నాకు డబ్బు వద్దులే అంటూ సమంత పేర్కొనడం, ఆ తర్వాత ... కావాలి కావాలి అంటూ సరదాగా వ్యాఖ్యానించడం, క్విట్ అయిపోతారా అని ఎన్టీఆర్ అడగ్గా... మీరు ఇప్పుడు చెబుతున్నారు, ముందే చెప్పాలి కదా అంటూ సమంత చిరుకోపం ప్రదర్శించడం ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచాయి.

'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమం సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు జెమినీ టీవీలో ప్రసారం అవుతుంది.

  • Loading...

More Telugu News