టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ

10-10-2021 Sun 16:15
  • అక్టోబరు 17 నుంచి టీ20 వరల్డ్ కప్
  • యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ
  • 16 జట్లు పాల్గొంటున్న వైనం
  • విజేతకు రూ.12 కోట్ల నజరానా
  • రన్నరప్ కు రూ.6 కోట్లు
ICC reveales prize money for world cup event
అక్టోబరు 17న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. యూఏఈ, ఒమన్ వేదికల్లో జరిగే ఈ మెగా ఈవెంట్ లో విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని ఐసీసీ నేడు వెల్లడించింది. టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు రూ.12.02 కోట్లు ఇవ్వనున్నారు. రన్నరప్ జట్టుకు రూ.6 కోట్లు దక్కనున్నాయి. సెమీఫైనల్లో ఓటమి పాలయ్యే జట్లకు రూ.3 కోట్ల చొప్పున నజరానా లభించనుంది. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో మొత్తం 16 జట్లు తలపడనున్నాయి.