ముగిసిన 'మా' ఎన్నికల పోలింగ్... రికార్డు స్థాయిలో ఓటింగ్

  • నేడు 'మా' ఎన్నికల పోలింగ్
  • మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్
  • 626 ఓట్లు పోలైన వైనం
  • అదనపు సమయం కేటాయింపు
  • కాసేపట్లో ఓట్ల లెక్కింపు
  • నేటి రాత్రికి ఫలితాలు
MAA elections polling concluded

గత కొన్ని వారాలుగా టాలీవుడ్ లో ఆవేశపూరిత వాతావరణం నెలకొనడానికి కారణమైన 'మా' ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి క్యూలో ఉన్నవారికి 3 గంటల వరకు ఓటేసేందుకు అనుమతించారు. గతంలో ఎన్నడూలేనంతగా ఈసారి 600కి పైగా ఓట్లు పోలయ్యాయి. గత 'మా' ఎన్నికల్లో కేవలం 468 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో 883 ఓట్లు ఉండగా, పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 665 మంది 'మా' సభ్యులు ఓటేశారు. పోలింగ్ కు అదనపు సమయాన్ని కేటాయించడంతో మరికొన్ని ఓట్లు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఓటింగ్ శాతం పెరగడంతో మా సభ్యుల్లో ఆనందం కనిపిస్తోంది. బెంగళూరు, ముంబయి, చెన్నై నుంచి వచ్చి ఓటేశారు.

కాగా, సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ రాత్రికి ఫలితాలను వెల్లడించే అవకాశాలున్నాయి.

More Telugu News