పిల్లల కోసం సామ్ కు ఎన్నెన్నో కలలు.. ఫ్యామిలీ కోసం భారీ ప్రాజెక్ట్ లు వదులుకుందన్న సమంత స్నేహితురాలు

10-10-2021 Sun 14:22
  • ఫ్యామిలీమ్యాన్ 2 తర్వాత భారీ ఆఫర్లు వచ్చాయన్న సాద్నా
  • కుటుంబం కోసం సమంత వద్దనుకుందని వెల్లడి
  • చై అంటే సామ్ కు చాలా ఇష్టమని కామెంట్
  • ఎందుకు విడిపోయారో తెలియదన్న మేకప్ ఆర్టిస్ట్
Samantha Friend Reveals Interesting Things About Sam

సమంత గురించి ఆమె స్నేహితురాలు, వ్యక్తిగత మేకప్ స్టైలిస్ట్ సాద్నా సింగ్ ఆసక్తికర కామెంట్లు చేసింది. సామ్ కు చై అంటే ఎంతో ఇష్టమని, కుటుంబం మీద ఎంతో ప్రేమ ఉందని, ఫ్యామిలీ కోసమే ఆమె ఎన్నో పెద్ద ప్రాజెక్టులను వదిలేసుకుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. చై–సామ్ మంచి జంట అని, ఎందుకు విడిపోయారో ఇప్పటికీ తనకు తెలియదని చెప్పింది.


సమంత చాలా మంచి వ్యక్తి అని పేర్కొంది. కొన్నేళ్లుగా తాను సమంతకు మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నానని తెలిపింది. టీంలోని ప్రతి ఒక్కరినీ ప్రేమగా చూసుకుంటుందని, చిన్నాపెద్ద అందరికీ గౌరవం ఇస్తుందని చెప్పింది. పిల్లల్ని కనేందుకు సామ్ ఎప్పుడూ నో చెప్పలేదని తెలిపింది. సామ్ కు పిల్లలంటే ఎంతో ఇష్టమని, వీలైనంత త్వరగా పిల్లల్ని కని ఫ్యామిలీ లైఫ్ ను ప్రారంభించేందుకు ఎన్నో కలలు కన్నదని వెల్లడించింది. పిల్లల పెంపకంపై తరచూ పుస్తకాలు చదువుతుండేదని తెలిపింది.

‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తర్వాత బాలీవుడ్ లో సామ్ కు భారీ ఆఫర్లు వచ్చాయని, కానీ, ఫ్యామిలీ కోసం వాటన్నింటినీ ఆమె వదులుకుందని సాద్నా చెప్పింది. ఎందుకు నో చెప్పావ్ అని తాను అడిగితే.. ముందు ఫ్యామిలీ ముఖ్యమని, కొన్నాళ్లపాటు బ్రేక్ తీసుకుంటానంటూ సామ్ చెప్పిందని గుర్తు చేసుకుంది.