జాయింటుగా సెల్ఫీ తీసుకున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు

  • నేడు మా ఎన్నికల పోలింగ్
  • పోలింగ్ కేంద్రం వద్ద ఆసక్తికర దృశ్యాలు
  • ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య ఆత్మీయ క్షణాలు
  • మోహన్ బాబుకు ప్రకాశ్ రాజ్ అభివాదం
Manchu Vishnu selfie with Prakash Raj

మా ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. నిన్నటివరకు ఒకరిపై ఒకరు నిప్పులు కురిపించిన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు నేడు పోలింగ్ బూత్ వద్ద చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఓ దశలో తీవ్ర విమర్శలకు పోయిన ఇరువురు ఈ ఉదయం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఒకరితో ఒకరు ఆప్యాయంగా ముచ్చటించుకోవడం కనిపించింది. ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకోవడం హైలైట్ అని చెప్పాలి.

మరింత విస్మయకర విషయం ఏమిటంటే.... మోహన్ బాబుకు ప్రకాశ్ రాజ్ తలవంచి అభివాదం చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు... ప్రకాశ్ రాజ్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. దాంతో అక్కడ ఉల్లాసభరిత వాతావరణం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News