ఇంట్లో కౌగిలి వెనుక చాలా అర్థాలుంటాయి.. నరేశ్ తో గొడవపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్

10-10-2021 Sun 12:04
  • పోలింగ్ సమయంలో నరేశ్ తో గొడవ
  • దానిపై వివరణ ఇచ్చిన ప్రకాశ్ రాజ్
  • గెలుపును నిర్ణయించేది ఓటర్లని కామెంట్
Prakash Raj Explanation On Quarrel With Naresh

నటీనటులు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయడం మంచి విషయమని ప్రకాశ్ రాజ్ అన్నారు. ‘మా’ పోలింగ్ సందర్భంగా ఓటేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. గెలుపును నిర్ణయించేది ఓటర్లేనన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద నరేశ్ తో గొడవపై ఆయన వివరణ ఇచ్చారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా.. ఇంట్లో కౌగిలికి ఎన్నో అర్థాలుంటాయని నవ్వుతూ చెప్పారు.

కాగా, పోలింగ్ వద్ద గందరగోళం కారణంగా అధికారులు కాసేపు పోలింగ్ ను ఆపేశారు. పోలింగ్ బూత్ లోకి ప్రకాశ్ రాజ్ గన్ మెన్లు రావడంతో విష్ణు అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలోనే నరేశ్, ప్రకాశ్ రాజ్ మధ్య గొడవ జరిగింది. మోహన్ బాబు వారిని నిలువరించారు. ఇప్పటిదాకా 220 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.