సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో ఆర్య‌-3!

10-10-2021 Sun 11:57
  • లైవ్ చాట్‌లో చెప్పిన సుకుమార్
  • ఆర్య 3 స్క్రిప్ట్ సిద్ధం అవుతోంద‌న్న ద‌ర్శ‌కుడు
  • ఈ ప్రాజెక్ట్ త్వ‌ర‌లోనే ప‌ట్టాలు ఎక్కే అవ‌కాశం ఉంద‌ని వివ‌ర‌ణ
arya 3 script ready
ఆర్య, ఆర్య‌-2 సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ద‌ర్శ‌కుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో ఆర్య‌-3 కూడా ఉంటుంద‌ట‌. ఈ విష‌యాన్ని సుకుమార్ సామాజిక మాధ్య‌మం ద్వారా వెల్ల‌డించారు. ఓ లైవ్ చాట్‌లో పాల్గొన్న ఆయ‌న.. ఆర్య-3 స్క్రిప్ట్ సిద్ధం అవుతోంద‌ని చెప్పారు. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ త్వ‌ర‌లోనే ప‌ట్టాలు ఎక్కే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.  

సుకుమార్, బ‌న్నీ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న‌ పుష్ప సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.  ఆర్య‌, ఆర్య‌2 సినిమాల‌కు కూడా దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఆయా సినిమాల్లోని పాటల‌న్నీ సూప‌ర్ హిట్ అయ్యాయి. ఆర్య‌-3కి కూడా ఆయ‌నే సంగీతం అందించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.