ఓటు ఎవరికి వేశారని అడిగితే.. చిరంజీవి చెప్పిన సమాధానం ఇదీ

10-10-2021 Sun 11:49
  • ‘మా’ ఎన్నికల్లో ఓటేసిన చిరు
  • అంతరాత్మ చెప్పినవారికి వేశానని కామెంట్
  • ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయన్న మెగాస్టార్
Megastar Chiranjeevi Casts Vote In MAA Elections

‘మా’ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి తన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సారి ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయన్నారు. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయని, ఒకేలా ఉండవని చెప్పారు. ఇంత వాడీవేడీగా ఎన్నికలు ఎప్పుడూ జరగవన్నారు. తర్వాతి ఎన్నికలు ఇలా జరగకుండా చూస్తామని చెప్పారు. కొందరు షూటింగ్ లలో ఉండడం వల్ల ఓటు వేయలేకపోయి ఉండొచ్చన్నారు. దాని గురించి మాట్లాడబోనన్నారు. ఓటు వేయడం, వేయకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. అది వారి వ్యక్తిగతమన్నారు. తన అంతరాత్మ చెప్పిన వారికే తాను ఓటేశానని చిరంజీవి చెప్పారు.