త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న భార‌త్‌, పాక్ మ్యాచులో ఇలాంటి జ‌ట్టే గెలుస్తుంది: అఫ్రిది

10-10-2021 Sun 11:39
  • ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్ల‌పై అధిక ఒత్తిడి
  • ఒత్తిడిని ఏ జ‌ట్టు బాగా హ్యాండిల్ చేస్తుందో ఆ జ‌ట్టుదే గెలుపు
  • ఏ జ‌ట్టు ఎక్కువ త‌ప్పులు చేయ‌దో ఆ జ‌ట్టే గెలుస్తుంది
afridi on india pak match

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ లో భాగంగా ఈ నెల 24న భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.  ఈ మ్యాచ్‌పై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది త‌న అభిప్రాయాన్ని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్ల‌పై అధిక ఒత్తిడి ఉంటుంద‌ని అన్నాడు

ఆ ఒత్తిడిని ఏ జ‌ట్టు బాగా హ్యాండిల్ చేస్తుందో, అలాగే ఏ జ‌ట్టు ఎక్కువ త‌ప్పులు చేయ‌దో ఆ జ‌ట్టే గెలుస్తుంద‌ని చెప్పాడు. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్స్ మ్యాచుల్లో పాక్‌పై భార‌త్‌దే పై చేయి. మొత్తం వ‌న్డే, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లు క‌లిపి 12 మ్యాచ్‌లలో ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌గా అన్నింట్లోనూ భార‌తే విజయం సాధించింది.