గద్వాల జిల్లాలో గోడ కూలి ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురి మృత్యువాత

10-10-2021 Sun 08:27
  • నిద్రిస్తున్న సమయంలో కూలిన గోడ
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • వర్షాలకు గోడలు నానడం వల్లే ప్రమాదం
5 dead including 3 children in Gadwal dist after Wall Collapse

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఓ ఇంటి గోడ కూలిన ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. రాత్రి భోజనం చేసి నిద్రించిన వీరిపై తెల్లవారుజామున గోడ కూలింది.

ఇటీవల కురుస్తున్న వర్షాలకు గోడలు నానిపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.