ఐదు నెలల తర్వాత నా మనవళ్లను కలిశాను: రఘురామకృష్ణరాజు

09-10-2021 Sat 22:12
  • సోషల్ మీడియాలో రఘురామ స్పందన
  • ఆసక్తికరమైన ఫొటో పంచుకున్న వైనం
  • మనవళ్లతో చిరునవ్వులు చిందిస్తున్న రఘురామ
  • నెటిజన్ల నుంచి విశేష స్పందన
Raghurama Krishna Raju with his grand children

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. ఆ ఫొటోలో తన ఇద్దరు మనవళ్లతో చిరునవ్వులు చిందిస్తున్న రఘురామను చూడొచ్చు. దీనిపై ఆయన స్పందిస్తూ, ఐదు నెలల తర్వాత మనవళ్లను కలిశానని వెల్లడించారు. ఎన్నో రోజుల తర్వాత మనవళ్లను చూసిన ఆనందం రఘురామ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. తాతకు ఇంతకన్నా ఆనందం ఏముంటుందని కొందరు, రఘురామ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని మరికొందరు కామెంట్లు చేశారు. తాతలానే డైనమిక్ గా ఉండండి అంటూ ఇంకొందరు ఆ చిన్నారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, రఘురామకృష్ణరాజుకు ఇందు అనే కుమార్తె, భరత్ అనే కుమారుడు ఉన్నారు.