తారక్ తో జీవిత ఏం మాట్లాడారో నాకు తెలియదు: రాజీవ్ కనకాల

09-10-2021 Sat 22:02
  • ఎన్టీఆర్ ఓటు అడగొద్దన్నాడన్న జీవిత 
  • ఆ విషయం తనకు తెలియదన్న రాజీవ్
  • తెలియని విషయంపై స్పందించలేనని వ్యాఖ్య 
  • తారక్ తో మాట్లాడతానన్న రాజీవ్ కనకాల 
Rajiv Kanakala responds in NTR and Jeevitha issue

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నో విమర్శలు, వివాదాలు, తీవ్ర ఆరోపణల నడుమ జరుగుతున్న మా ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల నటి జీవిత మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు అడగొద్దన్నాడని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నటుడు రాజీవ్ కనకాల స్పందించారు.

తారక్ తో జీవిత ఏం మాట్లాడారో, తారక్ ఆమెకు ఏమని బదులిచ్చారో తనకు తెలియదని అన్నారు. అయితే, మా ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఓటు వేయాలని తారక్ ను కూడా కోరతానని తెలిపారు. అంతకుమించి ఈ విషయంలో స్పందించలేనని రాజీవ్ స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల సినీ పరిశ్రమలో అత్యంత సన్నిహితులన్న విషయం తెలిసిందే.