సైదాబాద్ చిన్నారి కుటుంబానికి నగదు చెక్కు అందజేసిన పవన్ కల్యాణ్

09-10-2021 Sat 20:54
  • ఇటీవల సంచలనం సృష్టించిన ఘటన
  • సైదాబాద్ చిన్నారిపై హత్యాచారం
  • నిందితుడు రాజు ఆత్మహత్య
  • చిన్నారి కుటుంబాన్ని అక్కున చేర్చుకున్న జనసేనాని
Pawan Kalyan handed cash cheque to Saidabad girl family

ఇటీవల సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణ హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ నేడు పరామర్శించారు. ఇవాళ హైదరాబాదులో జనసేన తెలంగాణ విభాగం క్రియాశీలక కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సభా వేదిక వద్దకు వచ్చిన చిన్నారి తల్లిదండ్రులను పవన్ అక్కున చేర్చుకుని ఓదార్చారు. వారికి రూ.2.5 లక్షల నగదు చెక్కు అందజేశారు. ఆ చిన్నారి మృతికి సంతాపంగా వేదికపైనే మౌనం పాటించారు.

కొన్ని వారాల కిందట పల్లకొండ రాజు అనే యువకుడు ఇంటి పక్కనే ఉండే చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారకుడైన ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. పోలీసులు రాజు కోసం తీవ్ర గాలింపు చేపట్టగా, అతడు స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలు పట్టాలపై విగతజీవిలా కనిపించాడు. రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.