రిలీజ్ కి రెడీ అవుతున్న 'గ్యాంగ్ స్టర్ గంగరాజు'

09-10-2021 Sat 19:27
  • లక్ష్ హీరోగా యాక్షన్ డ్రామా 
  • కథానాయికగా వేదిక దత్ 
  • ప్రతినాయకుడిగా నిహార్ కపూర్ 
  • త్వరలోనే థియేటర్లలో రిలీజ్
Gangstar Gangaraju movie update

లక్ష్ చదలవాడ హీరోగా 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' సినిమా రూపొందుతోంది. పద్మావతి నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. వేదిక దత్ కథానాయికగా అలరించనుంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ కి అనూహ్యమైన రీతిలో రెస్పాన్స్ వచ్చింది.

విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమా, ప్రేక్షకులలో అంచనాలు పెంచే ప్రయత్నాల్లో ఉంది. ఒక పాట మినహా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ నెలలో ఈ పాట షూటింగుని కూడా పూర్తిచేయనున్నారు. సాయి కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

శ్రీకాంత్ అయ్యంగార్ .. గోపరాజు రమణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. జయసుధ రెండవ తనయుడు నిహార్ కపూర్ ఈ  సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. సాధ్యమైనంత త్వరలో ఈ సినిమాను థియేటర్లకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా మేకర్స్ చెబుతున్నారు.