కళామతల్లి లోకల్, నాన్ లోకల్ అని చూడదు: మురళీమోహన్

09-10-2021 Sat 19:09
  • మా ఎన్నికలపై మురళీమోహన్ స్పందన
  • ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ సమర్థులేనన్న మురళీమోహన్
  • ఏకగ్రీవం సాధ్యం కాలేదని వెల్లడి
  • ఇండస్ట్రీలో అందరూ సమానమేనని స్పష్టీకరణ
Murali Mohan opines on MAA Elections
మా ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ స్పందించారు. మా అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ సమర్థులేనన్నది తన అభిప్రాయమని పేర్కొన్నారు. మా ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని భావించినా సాధ్యం కాలేదని తెలిపారు. ఎవరు గెలిచినా సరే మా భవన నిర్మాణంతో పాటు సభ్యుల బాగోగుల కోసం శ్రమించాలని సూచించారు.

ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అనే వాదన తీసుకువరావడం విచారకరమని, ఆ విధమైన తేడా ఇండస్ట్రీలో లేదని పేర్కొన్నారు. కళామతల్లి లోకల్, నాన్ లోకల్ అని చూడదని, అందరూ సమానమేనని అన్నారు. మాలో సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చని స్పష్టం చేశారు. లోకల్, నాన్ లోకల్ భేదాలు పోవాలంటే పెద్ద హీరోలు చొరవ తీసుకుని ఇలాంటి విభేదాలను తొలగించే ప్రయత్నం చేయాలని మురళీమోహన్ పిలుపునిచ్చారు.