'అన్నాత్తే' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్!

09-10-2021 Sat 18:59
  • రజనీకాంత్ తాజా చిత్రంగా 'అన్నాత్తే'
  • మరోసారి రజనీ సరసన నయనతార
  • సంగీత దర్శకుడిగా ఇమాన్ 
  • నవంబర్ 4వ తేదీన విడుదల  
Annaatthe second single released

రజనీకాంత్ కథానాయకుడిగా సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో 'అన్నాత్తే' సినిమాను నిర్మించారు. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, 'దీపావళి' కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చురుకుగా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇటీవల ఫస్టు సింగిల్ ను వదిలిన ఈ సినిమా టీమ్, కొంత సేపటి క్రితం సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసింది. రజనీకాంత్ .. నయనతారపై అందంగా చిత్రీకరించిన పాట ఇది. ఇమాన్ స్వరపరిచిన ఈ పాటకు యుగభారతి సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ - శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఒకసారి వినగానే ఆకట్టుకునేలా ఉంది.

ఈ సినిమాలో ఖుష్బూ .. మీనా వంటి సీనియర్ హీరోయిన్స్ తో పాటు, కీర్తి సురేశ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. అంతేకాదు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జాకీ ష్రాఫ్ .. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేస్తుండటం, ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేలా చేస్తోంది.