'రాజా విక్రమార్క' డీప్ ఫారెస్టులోకి వెళ్లాడట!

09-10-2021 Sat 18:12
  • షూటింగును పూర్తి చేశాము
  • అవుట్ పుట్ బాగా వచ్చింది  
  • పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి
  • త్వరలోనే రిలీజ్ డేట్ చెబుతామన్న దర్శకుడు
Raja Vikramarka movie update

కార్తికేయ కథానాయకుడిగా 'రాజా విక్రమార్క' సినిమా రూపొందింది. ఈ సినిమాతో శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కార్తికేయ సరసన నాయికగా తాన్య రవిచంద్రన్ నటించిన ఈ సినిమాను, 88 రామారెడ్డి నిర్మించాడు. తాజాగా ఈ సినిమాను గురించి శ్రీ సరిపల్లి మాట్లాడాడు.

"ఈ సినిమా షూటింగు చాలా వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. గుడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను 'గండిపేట'లో చిత్రీకరించాము. కొన్ని కీలకమైన సన్నివేశాల కోసం 'మారేడుమిల్లి' వెళ్లాము. ఇంతవరకూ సినిమాల కోసం ఎవరూ వెళ్లని డీప్ ఫారెస్టులో షూటింగ్ చేశాము.

ఫారెస్టు సిబ్బంది సహకారం .. మా టీమ్ కష్టం వలన అక్కడి ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది. ఇక కార్తికేయ అందించిన సహకారం మాటల్లో చెప్పలేను. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుని, పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నాము" అని చెప్పుకొచ్చాడు.