CJ: తెలంగాణ హైకోర్టు సీజేగా సతీశ్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టుకు ప్రశాంత్ కుమార్... రాష్ట్రపతి ఉత్తర్వులు

  • రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులు
  • ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి
  • పలువురి బదిలీ
  • మరికొందరికి పదోన్నతి
New CJs for Telugu states high courts

ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల నేపథ్యంలో తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా సతీశ్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రశాంత్ కుమార్ మిశ్రాలను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ హైకోర్టు సీజే అరూప్ కుమార్ గోస్వామిని ఛత్తీస్ గఢ్ కు బదిలీ చేశారు. ఇటీవల వరకు తెలంగాణ హైకోర్టు సీజేగా వ్యవహరించిన హిమా కోహ్లీ సుప్రీంకోర్టు జడ్జిగా బదిలీ కావడం తెలిసిందే.

అదే సమయంలో పలువురు న్యాయమూర్తులకు సీజేలుగా పదోన్నతి కల్పించారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ప్రకాశ్ శ్రీవాస్తవను కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ ను గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి రంజిత్ వి మోరేకు మేఘాలయ హైకోర్టు సీజేగా పదోన్నతి కల్పించారు.

More Telugu News