KTR: తన పీఏ సోదరుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్

KTR visits his PA brother family
  • కేటీఆర్ వద్ద పీఏగా పనిచేస్తున్న మహేందర్ రెడ్డి
  • ఇటీవల మహేందర్ రెడ్డి సోదరుడు మృతి
  • తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు
  • అండగా ఉంటామన్న కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ వద్ద పీఏగా మహేందర్ రెడ్డి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇటీవల మహేందర్ రెడ్డి సోదరుడు అనారోగ్యంతో మరణించారు. దాంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన పీఏ మహేందర్ రెడ్డి సోదరుడి నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.  అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. పిల్లల భవిష్యత్తుకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

KTR
Mahendar Reddy
Brother
Death
Telangana

More Telugu News