Kajol: ప్రముఖ నటి దర్శకత్వంలో నాయికగా మరో ప్రముఖ నటి!

  • ఆమధ్య దర్శకురాలిగా మారిన రేవతి
  • ఇప్పటికి నాలుగు చిత్రాలకు దర్శకత్వం
  • ఐదో చిత్రంలో నాయికగా కాజోల్
  • 'ద లాస్ట్ హుర్రే' టైటిల్ నిర్ణయం
  • కథ హృదయాన్ని తాకిందన్న కాజోల్  
Revathy to direct Kajol

నటిగా రేవతి గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు భాషలలో ఆమె నటించిన పలు సినిమాలే ఆమె అభినయం ఏపాటిదో మనకు చెబుతాయి. అలాంటి నటి కొన్నాళ్ల క్రితం దర్శకురాలిగా కూడా మారింది. హిందీ, ఇంగ్లిష్, మలయాళంలో ఇప్పటికి నాలుగు సినిమాలు డైరెక్ట్ చేసి, ప్రతిభావంతమైన దర్శకురాలిగా కూడా పేరుతెచ్చుకుంది.

ఈ క్రమంలో ఇప్పుడు దర్శకురాలిగా తన ఐదో చిత్రానికి ఆమె రెడీ అవుతోంది. హిందీలో నిర్మితమయ్యే ఈ చిత్రంలో ప్రముఖ కథానాయిక కాజోల్ హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి 'ద లాస్ట్ హుర్రే' అనే టైటిల్ని కూడా నిర్ణయించి అధికారికంగా ప్రకటించారు.

రేవతి చెప్పిన కథ వినగానే హృదయానికి తాకిందనీ, అందుకే దీనికి వెంటనే ఓకే చెప్పేశానని కథానాయిక కాజల్ పేర్కొంది. 'నా తదుపరి చిత్రానికి రేవతి దర్శకత్వం వహిస్తుందని తెలియజేయడానికి హ్యాపీగా వుంది' అంటూ కాజోల్ చెప్పింది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని బీలైవ్ ప్రొడక్షన్స్, టేక్ 23 స్టూడియోస్ ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రేవతి, కాజోల్ వంటి ఇద్దరు ప్రతిభావంతమైన నటీమణులు కలిసి చేస్తున్న ఈ చిత్రం అప్పుడే అందరిలోనూ కూతూహలాన్ని రేకెత్తిస్తోంది.

More Telugu News