టాక్ షో ప్రోమో చిత్రీకరణ సందర్భంగా బాలకృష్ణకు గాయం!

09-10-2021 Sat 16:13
  • ఆహా ఓటీటీలో టాక్ షో
  • హోస్ట్ గా బాలయ్య
  • అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రోమో చిత్రీకరణ
  • కాలికి గాయంతోనే షూటింగ్ కంప్లీట్ చేసిన వైనం
Reports says Balakrishna injured in a talk show promo shooting
ఆహా ఓటీటీకి సంబంధించిన ఓ టాక్ షో ప్రోమో చిత్రీకరణలో నందమూరి బాలకృష్ణ గాయపడ్డారు. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రోమో షూట్ చేస్తుండగా బాలకృష్ణ కాలికి గాయమైంది. అయితే, ఆయన అదేమీ లెక్కచేయకుండా షూటింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.

ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే ఈ టాక్ షోకు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మంచు కుటుంబంతో తొలి ఎపిసోడ్ చేస్తున్నట్టు సమాచారం. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించే ఈ కార్యక్రమానికి 'అన్ స్టాపబుల్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ తదితరులు రియాల్టీ షోలు, గేమ్ షోలకు హోస్ట్ లుగా చేయడం తెలిసిందే. మరి బాలకృష్ణ ఏవిధంగా కార్యక్రమాన్ని నడిపిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.