Botsa Satyanarayana: కేంద్ర ప్రభుత్వ విధివిధానాలతోనే ఇళ్ల పథకం చేపట్టాం... రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుంది?: మంత్రి బొత్స

Botsa responds to high court decision on housing scheme
  • సెంటు భూమిలో ఇంటి నిర్మాణంపై హైకోర్టు తీర్పు
  • కమిటీతో అధ్యయనం చేయించాలని సూచన
  • అప్పటివరకు ఇళ్ల నిర్మాణం చేపట్టరాదని ఆదేశాలు
  • తీర్పు బాధ కలిగించిందన్న బొత్స
సెంటు భూమిలో ఓ ఇల్లు కట్టడం సాధ్యామేనా? అని హైకోర్టు నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. గృహ నిర్మాణం కోసం పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర భూమి సరిపోదని, దీనిపై ప్రత్యేక కమిటీ ద్వారా అధ్యయనం చేయించాలని హైకోర్టు నిన్న పేర్కొంది. అంతేకాదు, కమిటీ అధ్యయనం పూర్తయ్యేవరకు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేసింది.

దీనిపై మంత్రి బొత్స మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగానే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, ఇది రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించారు. అయితే కోర్టు తీర్పుకు తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రతి మహిళ సొంతింటి కలను నెరవేర్చేందుకే ఇళ్ల పథకం తీసుకువచ్చామని వెల్లడించారు. ఇలాంటి ప్రజాసంక్షేమ కార్యక్రమాలను కూడా అడ్డుకుంటున్నారని బొత్స వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పు తమకు బాధ కలిగించిందని అన్నారు.
Botsa Satyanarayana
AP High Court
Housing
YSRCP
Andhra Pradesh

More Telugu News