Prabhas: 'ఆది పురుష్'లో తన పోర్షన్ కంప్లీట్ చేసిన సైఫ్!

Saif completes his portion Adi Purush shooting
  • షూటింగు దశలో ఉన్న 'ఆది పురుష్'
  • జోరుగా జరుగుతున్న చిత్రీకరణ
  • రావణుడి పాత్రలో మెప్పించనున్న సైఫ్
  • ఆయనకి వీడ్కోలు పలికిన టీమ్
ప్రభాస్ కథానాయకుడిగా .. భారీ పౌరాణిక చిత్రంగా 'ఆది పురుష్' సినిమా సెట్స్ పైకి వెళ్లింది. దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను పట్టాలెక్కించాడు. ఇది రామాయణ ఇతివృత్తంతో సాగే కథే అయినప్పటికీ, ఈ స్థాయిలో తెరపై ఆవిష్కరించబడిన సినిమా ఇంతవరకూ రాలేదని చెప్పారు.

ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్ .. సీతాదేవిగా కృతి సనన్ .. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేయించారు. ఇటీవల ప్రభాస్ - సైఫ్ అలీ పాత్రలకు సంబంధించిన పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అప్పుడే క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారా? అనుకున్నారు.

ఇక తాజాగా సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించిన పోర్షన్ షూటింగు పూర్తయిందని చెప్పారు. ఆయన షూటింగులో పాల్గొన్న చివరి రోజున కేక్ కట్ చేయించారు. సెట్లో అంతా కలిసి సందడి చేస్తూ ఆయనకి వీడ్కోలు పలికారు. నిజానికి 'ఆది పురుష్' ఇప్పుడెక్కడ పూర్తవుతుంది? అని చాలామంది అనుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగు చాలా వేగంగా జరుగుతున్నట్టుగా అర్థమవుతోంది.
Prabhas
Kruthi Sanon
Saif Ali Khan

More Telugu News