భారీ వర్షానికి రోడ్డుపై వరద.. హైదరాబాద్-బెంగళూరు మార్గంలో మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

09-10-2021 Sat 09:14
  • గత రాత్రి అకస్మాత్తుగా భారీ వర్షం
  • కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద వరదనీటిలో చిక్కుకుపోయిన లారీ
  • ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
Heavy Rain interrupts Traffic in Hyderbad Bengaluru High way

హైదరాబాద్‌లో గత రాత్రి అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఓ లారీ బ్రేక్ డౌన్ కారణంగా వరదనీటిలో చిక్కుకుపోవడంతో హైదరాబాద్-బెంగళూరు రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుకు అటుఇటు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, అరాంఘర్-శంషాబాద్ రహదారిపైనా ఇలాంటి పరిస్థితే నెలకొంది.