హుజూరాబాద్‌లో ఈటలకు కొత్త తలనొప్పి.. రాజేందర్ పేరుతో బరిలో మొత్తం నలుగురు!

09-10-2021 Sat 08:33
  • అందరి పేర్లు ‘ఈ’తోనే మొదలు
  • బీజేపీలో ఓట్లు చీలిపోతాయన్న భయం
  • బరిలో మొత్తంగా 61 మంది
4 Rajenders contesting in Huzurabad By Poll

హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీపడుతున్న బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు కొత్త తలనొప్పి వచ్చింది. ఆయన కాకుండా రాజేందర్ పేరుతో మరో ముగ్గురు అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీపడుతున్నారు. వారి ఇంటిపేర్లు కూడా ‘ఈ’తోనే ప్రారంభం కావడం గమనార్హం. దీంతో ఓట్లు ఎక్కడ చీలిపోతాయోనన్న ఆందోళన ఇప్పుడు బీజేపీ వర్గాల్లో మొదలైంది.

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఇమ్మడి రాజేందర్, న్యూ ఇండియా పార్టీ నుంచి ఈసంపల్లి రాజేందర్, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ నుంచి ఇప్పలపల్లి రాజేందర్ పోటీలో ఉన్నారు. వీరందరూ నిన్ననే నామినేషన్లు వేశారు. నిన్నటితో నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నెల 7వ తేదీ వరకు 15 మంది నామినేషన్లు వేయగా, చివరి రోజైన నిన్న 46 మంది కలిపి మొత్తంగా 61 మంది నామినేషన్లు దాఖలు చేశారు.