PCB: మోదీ తలచుకుంటే పాక్ క్రికెట్ బోర్డు కుప్పకూలుతుంది: పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు

  • పాకిస్థాన్‌ బోర్డుకు 50 శాతం నిధులు ఐసీసీ నుంచే వస్తున్నాయి
  • ఐసీసీకి బీసీసీఐ నుంచి 90 శాతం నిధులు
  • పీసీబీని నడిపిస్తున్నది భారత వ్యాపారవేత్తలే
  • మోదీ కనుక నిర్ణయించుకుంటే పాక్ బోర్డు పని అయిపోయినట్టే
PCB can collapse if Indian government wants said Rameez Raja

భారత ప్రధాని నరేంద్రమోదీ కనుక తలచుకుంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కుప్పకూలిపోతుందని ఆ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ నుంచి పీసీబీకి నిధులు అందకూడదని భారత ప్రధాని నరేంద్రమోదీ భావిస్తే పీసీబీ పని అయిపోతుందని వ్యాఖ్యానించాడు.

ఐసీసీ నుంచి పాకిస్థాన్ బోర్డుకు 50 శాతం నిధులు వస్తున్నాయన్న రమీజ్ రాజా.. ఐసీసీకి అందుతున్న నిధుల్లో 90 శాతం బీసీసీఐ నుంచే వస్తున్నాయన్నాడు. ఈ రకంగా చూసుకుంటే పాక్ క్రికెట్ బోర్డును భారత వ్యాపార సంస్థలే నిర్వహిస్తున్నట్టు అర్థమని అన్నాడు. ఒకవేళ భారత ప్రధాని మోదీ కనుక పాకిస్థాన్‌కు నిధులు అందకుండా చేయాలని భావిస్తే పీసీబీ ఉన్నఫళంగా కుప్పకూలడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశాడు.

‘‘పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ నిధులపైనే ఆధారపడింది. ఒకవేళ ఏదైనా కారణంతో ఐసీసీ కనుక నిధులు ఆపేస్తే పీసీబీకి కష్టాలు తప్పవు. ప్రపంచ క్రికెట్‌లో పాకిస్థాన్ సూపర్ పవర్‌గా ఎదగాలంటే సహకారం ఎంతో అవసరం. పాక్ క్రికెట్‌కు స్థానిక వ్యాపారవేత్తల నుంచి అందుతున్నది అంతంత మాత్రమేనని తెలసి షాక్‌కు గురయ్యా’’ అని పాకిస్థాన్ సెనేట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రమీజ్ పేర్కొన్నాడు.

More Telugu News