సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

09-10-2021 Sat 07:36
  • పవన్ సినిమాలో పూజ ఖరారు 
  • నవంబర్ 4న 'వరుడు కావలెను'
  • ఓటీటీకి వెళ్లిన సునీల్ సినిమా
Pooja Hegde confirmed opposite Pawan Kalyan

*  పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు .. భగత్ సింగ్' అనే సినిమా రూపొందనుంది. ఇందులో కథానాయికగా పూజ హెగ్డేను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు హరీశ్ తాజాగా ప్రకటించాడు.
*  నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా రూపొందిన 'వరుడు కావలెను' చిత్రం విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ దసరాకు ఇది విడుదల కావాలి. అయితే, ఇతర సినిమాలు కూడా దసరాకు ఉండడంతో, దీనిని నవంబర్ 4కి వాయిదా వేసినట్టు తాజా సమాచారం.
*  ప్రముఖ హాస్యనటుడు సునీల్ ప్రధాన పాత్ర పోషించిన 'హెడ్స్ అండ్ టేల్స్' చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'లో ఈ నెల 22 నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతుంది. ఒక్కరాత్రిలో జరిగే కథగా దీనిని నటుడు సాయికృష్ణ ఎన్రెడ్డి తెరకెక్కించాడు.