తెలంగాణలో మరో 201 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona cases and deaths media report
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 47,465 కరోనా పరీక్షలు నిర్వహించగా, 201 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 64 కొత్త కేసులు వెల్లడయ్యాయి. వరంగల్ అర్బన్, రంగారెడ్డి జిల్లాలలో 12 చొప్పున, నల్గొండ జిల్లాలో 11 కేసులు గుర్తించారు. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, నాగర్ కర్నూల్, ములుగు జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 220 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,67,535 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,59,263 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,345 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,927కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Media Report
New Cases
Deaths

More Telugu News