దీపక్ చహర్ ప్రపోజ్ చేసిన అమ్మాయి ఎవరో తెలిసిపోయింది!

08-10-2021 Fri 19:13
  • నిన్న స్టేడియంలో తన ప్రేయసికి ప్రపోజ్ చేసిన దీపక్ చహర్
  • ఆమె పేరు జయ భరద్వాజ్
  • ఢిల్లీలో ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం
  • చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్న దీపక్, జయ
All about Deepak Chahar girl friend

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చహర్ నిన్న స్టేడియంలో ఓ అమ్మాయికి ప్రపోజ్ చేయడం, ఆమె యస్ అంటూ అంగీకారం తెలపడం తెలిసిందే. అయితే, చూడ్డానికి విదేశీ వనితలా కనిపించిన ఆ అమ్మాయి ఎవరో తెలియక నెటిజన్లు గూగుల్ వెంటపడ్డారు. అయితే, చహర్ మనసు దోచిన ఆ మగువ విదేశీయురాలు కాదు, మన దేశీయురాలే.

ఆమె పేరు జయ భరద్వాజ్. ఢిల్లీ వాస్తవ్యురాలు. అక్కడే ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తోంది. ఆమె సోదరుడు సిద్ధార్థ్ భరద్వాజ్ టెలివిజన్ రంగంలో ఎంతో పాప్యులర్. మోడల్, వీజే అయిన సిద్ధార్థ్ ఎంటీవీ రియాలిటీ షో స్ప్లిట్స్ విల్లా-2 విజేత కూడా. ఈ సంగతులు దీపక్ చహర్ సోదరి మాలతీ చహర్ వెల్లడించారు.

కాగా, దీపక్ చహర్, జయ భరద్వాజ్ చాలాకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. గతంలో చెన్నై జట్టు ఆడిన అనేక ఐపీఎల్ మ్యాచ్ లకు హాజరైన జయ... స్టాండ్స్ లో ఉండి ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. అయితే, తమ ప్రేమ వ్యవహారాన్ని మాత్రం దీపక్, జయ ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచారు.