ఆంధ్రప్రదేశ్ లో మరో 693 కరోనా కేసుల వెల్లడి

08-10-2021 Fri 18:32
  • ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 48,235 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 178 కేసులు
  • రాష్ట్రంలో 8 కరోనా మరణాలు
  • ఇంకా 8,310 మందికి చికిత్స
Andhra Pradesh covid media report

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 48,235 కరోనా పరీక్షలు నిర్వహించగా, 693 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 178 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 93, గుంటూరు జిల్లాలో 91, నెల్లూరు జిల్లాలో 72 కేసులు వెలుగు చూశాయి. అత్యల్పంగా కర్నూలు, విజయనగరం జిల్లాలలో 6 కేసుల చొప్పున గుర్తించారు.

అదే సమయంలో 927 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,242కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,55,999 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,33,447 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,310 మంది చికిత్స పొందుతున్నారు.