CM KCR: నాడు రోశయ్య అసెంబ్లీకి ఉరితాడు తెచ్చుకుంటే వద్దని వారించాం: సీఎం కేసీఆర్

CM KCR tells Rosaiah issue in Assembly
  • ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  • సభ నిరవధిక వాయిదా
  • సీఎం కేసీఆర్ ప్రసంగం
  • కాంగ్రెస్ కంటే తమదే మెరుగైన పార్టీ అని వ్యాఖ్య  
గత వారం రోజులుగా సాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అంతకుముందు సీఎం కేసీఆర్ ప్రసంగంలో ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ అని, అయితే ఆ పార్టీ కంటే టీఆర్ఎస్ మెరుగైన పార్టీ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఏమీ చేయలేదని తాము అనడంలేదని, అయితే చేయాల్సిన రీతిలో చేయలేదని విమర్శించారు. విద్యుత్, సాగు నీటిని అందించడంలో కాంగ్రెస్ విఫలమైందని, టీఆర్ఎస్ చేసి చూపించిందని అన్నారు.

నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో, విద్యుత్ ఇవ్వలేకపోతే శాసనసభలో ఉరి వేసుకుంటానని రోశయ్య ప్రకటించారని కేసీఆర్ గుర్తుచేశారు. అనడమే కాకుండా, అసెంబ్లీకి సూట్ కేసులో ఉరితాడు కూడా తెచ్చుకున్నారని, కానీ తాము వద్దని వారించామని వివరించారు. మీరు పెద్ద మనిషి అంటూ నచ్చచెప్పామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మేనేజ్ మెంట్ నైపుణ్యాలు లేవని, అవి టీఆర్ఎస్ కు మెండుగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
CM KCR
Rosaiah
Congress
Assembly
Telangana

More Telugu News