సెన్సార్ పూర్తి చేసుకున్న 'మహా సముద్రం'

08-10-2021 Fri 18:17
  • అజయ్ భూపతి నుంచి 'మహా సముద్రం'
  • యాక్షన్ తో ముడిపడిన ఎమోషనల్ లవ్ స్టోరీ
  • సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ 
  • ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు 
Maga Samudram Censor Completed

అజయ్ భూపతి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మహాసముద్రం' సిద్ధమవుతోంది. బలమైన కథాకథనాలు .. ఉద్వేగపూరితమైన పాత్రలు .. ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆయన చెప్పాడు. ఈ కథపై చాలా కాలం కసరత్తు చేయడం వలన అంతటి నమ్మకం ఏర్పడిందని అన్నాడు.

ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. శర్వానంద్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ .. సిద్ధార్థ్ సరసన అదితీ రావు అలరించనున్నారు.

ఇక ఈ సినిమాలో జగపతిబాబు .. రావు రమేశ్ .. 'గరుడ' రామ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూడు పాత్రలను అజయ్ భూపతి చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడట. అందువలన ఈ పాత్రలు మూడు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. దసరా బరిలో ఈ సినిమా ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి. .