ఫొటో వైరల్.. తారక్ ప్రోగ్రామ్ లో సమంత!

08-10-2021 Fri 14:15
  • ఎవరు మీలో కోటీశ్వరులు?లో పార్టిసిపేషన్
  • నిన్ననే షూటింగ్ అయిందని టాక్
  • ప్రోగ్రామ్ మేనేజర్ తో సామ్ ఫొటో వైరల్
Samantha To Test Her Luck In Evaru Meelo Koteeshwarulu

ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్ లో సమంత మెరవనుందా? అంటే అవుననే అంటున్నారు. హాట్ సీట్ లో కూర్చుని ఆమె హల్ చల్ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన షూటింగ్ ను గురువారం ఆమె పూర్తి చేసిందట. కార్యక్రమానికి సంబంధించి.. ఆ ప్రోగ్రామ్ మేనేజర్ మహేంద్రతో కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రోగ్రామ్ లో గెలిచిన చెక్ తో ఆమె పోజిచ్చింది. మరి, ప్రోగ్రామ్ లో సమంతకు తారక్ ఎలాంటి ప్రశ్నలు సంధించాడు? ఎంత గెలుచుకుంది? అనేది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చెయ్యాల్సిందే.