Dhulipala Narendra Kumar: డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు.. టీడీపీ నేత ధూళిపాళ్లకు పోలీసుల నోటీసులు

Kakinada Police gave notices to TDP Leader Dulipalla Narendra
  • ముంద్రా పోర్టులో పట్టుబడిన డ్రగ్స్‌తో ఏపీకి సంబంధాలు
  • ప్రభుత్వంపై చేసిన విమర్శలకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు
  • ఇంటికి వచ్చి  నోటీసులు అందించిన కాకినాడ పోలీసులు
గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో ఇటీవల పెద్ద ఎత్తున పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో ఏపీకి లింకులు ఉన్నట్టు బయటపడడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ డ్రగ్స్ వ్యవహారంతో ప్రభుత్వానికి సంబంధాలున్నాయని ప్రతిపక్ష టీడీపీ తొలి నుంచీ ఆరోపిస్తోంది.

ఈ క్రమంలో ధూళిపాళ్ల కూడా ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. దీంతో కాకినాడ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వంపై చేసిన విమర్శలకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆ నోటీసుల్లో కోరారు. విచారణకు హాజరై ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని సూచించారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ధూళిపాళ్ల  నివాసానికి నిన్న వచ్చిన  కాకినాడ పోలీసులు నోటీసులు అందజేశారు.
Dhulipala Narendra Kumar
Telugudesam
Drugs Case
Notices

More Telugu News