Nilam Sawhney: ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకంపై దాఖలైన పిటిషన్ కొట్టివేత

  • ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని
  • నీలం సాహ్ని నియామకం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్
  • పిటిషన్ దాఖలు చేసిన రేగు మహేశ్వరరావు
  • ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు
High Court dismiss petition on Nilam Sawhney appointment as SEC

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నీలం సాహ్ని నియామకంపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు నేడు కొట్టివేసింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం చెల్లదంటూ రేగు మహేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గతంలో నీలం సాహ్ని ముఖ్యమంత్రికి సలహాదారుగా పనిచేశారని, అందువల్ల ఎస్ఈసీగా ఆమె పనితీరుపై రాజకీయ ప్రభావం ఉండే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఎస్ఈసీగా ఆమె నియామకం సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం పిటిషన్ చెల్లదంటూ కొట్టివేసింది. 

More Telugu News