Shiva kandukuri: 'మనుచరిత్ర' నుంచి టీజర్ రిలీజ్!

  • తెరపైకి మరో ప్రేమకథ
  • ఎమోషన్ తో కూడిన యాక్షన్
  • కథానాయికగా మేఘ ఆకాశ్
  • త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన    
Manucharithra teaser released

శివ కందుకూరి హీరోగా నార్ల శ్రీనివాసరెడ్డి 'మనుచరిత్ర' సినిమాను నిర్మించారు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాకి సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉండగా ప్రధానమైన నాయికగా మేఘ ఆకాశ్ అలరించనుంది. మిగతా ఇద్దరు కథానాయికలుగా ప్రియ వడ్లమాని .. ప్రగతి శ్రీవాత్సవ కనిపించనున్నారు.  

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలో సాగే సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. ఈ సినిమాతో భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టీజర్ ను చూస్తుంటే సినిమాపై అంచనాలు పెంచేదిలానే అనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

కొంతకాలం క్రితమే తెలుగు తెరకి పరిచయమైన శివ కందుకూరి, సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాను ఆశించిన బ్రేక్ ఈ సినిమాతో లభిస్తుందని ఆయన భావిస్తున్నాడు. ఇటీవల రెండు హిట్లు అందుకున్న మేఘ ఆకాశ్ ఈ సినిమాకి ప్లస్ కానుంది.

More Telugu News