'మహా సముద్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పవన్?

07-10-2021 Thu 18:04
  • ఈ నెల 9వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • వేదికగా హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్
  • ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు, రావు రమేశ్
  • ఈ నెల 14వ తేదీన సినిమా విడుదల
Maha Samidram pre release event on 9th October
శర్వానంద్ - సిద్ధార్థ్ ప్రధానమైన పాత్రధారులుగా 'మహా సముద్రం' రూపొందింది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, చైతన్ భరద్వాజ్ బాణీలను సమకూర్చాడు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖాయం చేశారు. ఈ నెల 9వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి వేడుక మొదలుకానుంది. ఈ ఈవెంట్ కి హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా మారుతోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కల్యాణ్ ను ముఖ్య అథితిగా ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అందుకు సంబంధించిన పోస్టర్ వదలడానికి మేకర్స్ రెడీగా ఉన్నారని అంటున్నారు. అదితీరావు .. అనూ  ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు, రావు రమేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.