Chennai Super Kings: రాణించిన డుప్లెసిస్... చెన్నై 20 ఓవర్లలో 134-6

Chennai settles for low score against Punjab Kings
  • దుబాయ్ లో జరుగుతున్న మ్యాచ్
  • టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై
  • డుప్లెసిస్ అర్ధసెంచరీ
  • బ్యాటింగ్ లో విఫలమైన చెన్నై ఆటగాళ్లు

ఇప్పటికే ప్లే ఆఫ్స్ లో ప్రవేశించిన చెన్నై సూపర్ కింగ్స్ నేడు పంజాబ్ కింగ్స్ తో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించాడు.

డుప్లెసిస్ 55 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 12, జడేజా 15 నాటౌట్, ధోనీ 12 పరుగులు చేశారు. మొయిన్ అలీ (0), రాబిన్ ఊతప్ప (2), అంబటి రాయుడు (4) పేలవంగా ఆడి అవుటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, క్రిస్ జోర్డాన్ 2, షమీ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News