టీడీపీ నేతల అరుపులను లెక్కచేయను: ఎమ్మెల్యే ద్వారంపూడి

07-10-2021 Thu 14:57
  • ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్ సెగలు
  • వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తోన్న టీడీపీ
  • బదులిచ్చిన ద్వారంపూడి
  • తప్పుడు కథనాలకు భయపడబోనని స్పష్టీకరణ
YCP MLA Dwarampudi responds to TDP leaders allegations
ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్ వ్యవహారం మరింతగా రాజుకుంటోంది. డ్రగ్స్ దిగుమతిలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హస్తం ఉందంటూ టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ద్వారంపూడి బదులిచ్చారు. డ్రగ్స్ రవాణాపై దర్యాప్తు సంస్థల విచారణలో వాస్తవాలు తేలతాయని అన్నారు. టీడీపీ నేతల అరుపులను తాను లెక్కచేయనని, మీడియాలో తనపై వచ్చే తప్పుడు కథనాలకు భయపడబోనని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల రవాణాపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, 3 నెలల్లో రూ.23 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నామని వెల్లడించారు.