Hrithik Roshan: దేవుడు దయగలవాడు... షారుఖ్ కుమారుడిని ఉద్దేశించి హృతిక్ రోషన్ స్పందన

Hrithik Roshan post for Aryan Khan
  • జీవితం ఒక వింత ప్రయాణం
  • దేవుడు కఠినమైన బంతులనే ఇస్తాడు
  • ప్రశాంతంగా ఉండు
ముంబై సముద్రతీరంలో క్రూయిజ్ షిప్ లో జరిపిన డ్రగ్స్ దాడులలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్యన్ గురించి పలువురు బాలీవుడ్ స్టార్లు భావోద్వేగంగా స్పందిస్తున్నారు.

 తాజాగా హృతిక్ రోషన్ ఇన్ స్టా ద్వారా స్పందిస్తూ... 'జీవితం ఒక వింత ప్రయాణం. ఇది చాలా గొప్పది.. ఎందుకంటే అది అనిశ్చితిగా ఉంటుంది. అది మనతో ఆడుకుంటుంది. కానీ దేవుడు దయగలవాడు. మనం ఆడటానికి దేవుడు కఠినమైన బంతులనే ఇస్తాడు. నీవు ఒత్తిడిని తట్టుకోగలవు అని తెలిసే ఆయన నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నీవు ఇప్పుడు ఆ అనుభూతిని చెందుతున్నావని నాకు తెలుసు. కోపం, గందరగోళం, నిస్సహాయత. వీటన్నింటినీ నీ నుంచి బయటకు పంపించు. నీవు చిన్న పిల్లాడిగా నాకు తెలుసు. ఒక యువకుడిగా కూడా తెలుసు. నీ జీవితంలో వచ్చే అన్నింటినీ అనుభవించు. అవి నీకు బహుమతులు. ప్రశాంతంగా ఉండు' అంటూ పేర్కొన్నాడు.
Hrithik Roshan
Shahrukh Khan
Aryan Khan
Bollywood

More Telugu News