Viral Videos: లఖింపూర్ ఖేరీలో రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటన.. క్లారిటీతో ఉన్న వీడియో పోస్ట్ చేసిన వరుణ్ గాంధీ!
- ఇంతకు ముందు కూడా ఓ వీడియో వైరల్
- అందులో దృశ్యాలు సరిగ్గా కనిపించని వైనం
- రైతులకు న్యాయం చేయాలని కొత్త వీడియో పోస్ట్ చేసిన వరుణ్
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో చోటుచేసుకున్న హింసలో పలువురు రైతులు మరణించిన విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన తెలుపుతోన్న రైతుల పైనుంచి కారును పోనివ్వడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పటికే బయటకు రాగా అందులో దృశ్యాలు స్పష్టంగా కనపడలేదు. అదే ఘటనకు సంబంధించిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశారు. ఇందులోని దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి.
ఈ వీడియో స్పష్టంగా ఉందని, హత్యల ద్వారా నిరసనకారుల గళాన్ని అణచివేయలేమని వరుణ్ గాంధీ పేర్కొనడం గమనార్హం. రైతులు చిందించిన రక్తానికి జవాబుదారీ అవసరమని ఆయన పేర్కొన్నారు. నిరసన తెలుపుతోన్న రైతుల్లో క్రూరత్వం ప్రవేశించక ముందే వారికి న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు.