Police: హైద‌రాబాద్‌లో వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్టు.. ఐదుగురు అమ్మాయిల అరెస్టు

police arrest 7 accuse in sanath nagar
  • స‌న‌త్ న‌గ‌ర్‌లో ఘ‌ట‌న‌
  • మ‌రో ఇద్ద‌రు నిర్వాహ‌కుల అరెస్టు
  • మ‌రింత స‌మాచారం బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం
హైదరాబాద్‌లో ఓ వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్టు చేశారు పోలీసులు. సనత్‌నగర్‌లో వ్యభిచార ముఠా కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తోంద‌ని సమాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు వెళ్లి దాడులు జ‌ర‌ప‌డంతో కీల‌క విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు అమ్మాయిలను పోలీసులు అరెస్టు చేశారు.

అలాగే, వ్యభిచార గృహ‌ నిర్వాహ‌కులు ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. ఆ ఇద్ద‌రు నిందితులు బంగ్లాదేశ్‌ నుంచి అమ్మాయిల‌ను ఇక్క‌డ‌కు రప్పించి వారితో వ్యభిచారం నిర్వహిస్తూ డ‌బ్బు సంపాదించుకుంటున్నార‌ని పోలీసులు చెప్పారు. వారిని విచారిస్తే మ‌రింత స‌మాచారం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని తెలిపారు.
Police
Hyderabad
Crime News

More Telugu News