Hetero Drugs: హెటిరో డ్రగ్స్ లో రెండో రోజు కూడా కొనసాగుతున్న తనిఖీలు

IT raids on Hetero Drugs continuing for second day
  • నిన్న ఉదయం ప్రారంభమైన ఐటీ సోదాలు
  • హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్ లలో సోదాలు
  • ఆర్థిక లావాదేవీలు, ఐటీ రిటర్నులకు సంబంధించిన డాక్యుమెంట్ల స్వాధీనం
ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో డ్రగ్స్ పై ఐటీ అధికారుల సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం సోదాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ తో పాటు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో సోదాలు జరుగుతున్నాయి. 20 మంది అధికారులతో కూడిన బృందం తనిఖీలు నిర్వహిస్తోంది.

హెటిరో డ్రగ్స్ డైరెక్టర్లు, సీఈఓ ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఐటీ రిటర్నులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంస్థ డైరెక్టర్లు సందీప్ రెడ్డి, నరసింహారెడ్డి, వంశీకృష్ణ, పార్థసారథిరెడ్డిలతో పాటు మరికొందరి ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. తెలుగు శ్రీమంతుల జాబితాలో పార్థసారథిరెడ్డి రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
Hetero Drugs
IT Raids

More Telugu News