Panja Vaisshnav Tej: 'కొండ పొలం' నుంచి హుషారైన సాంగ్!

  • 'కొండ పొలం' నుంచి మరో పాట
  • చంద్రబోస్ కలం నుంచి పడుచు పదాలు  
  • కాలభైరవ - శ్రేయ ఘోషల్ ఆలాపన
  • ఈ నెల 8వ తేదీన సినిమా విడుదల  
Kondapolam video song released

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా రకుల్ కథానాయికగా 'కొండ పొలం' సినిమా రూపొందింది. కొండప్రాంతంలోని గిరిజనుల జీవితాలకు ఒక అందమైన ప్రేమకథను కలుపుతూ క్రిష్ ఈ సినిమాను నడిపించాడు. సాయిబాబు - రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు."చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చా మావ .. లొట్టేసి జుర్రుకుంటావా. బుట్టల్లో చిట్టిపూలు పట్టుకొచ్చానమ్మా .. నచ్చింది చుట్టుకుంటావా" అంటూ ఈ పాట సాగుతోంది. బ్యూటిఫుల్ సెట్లో .. గ్రూప్ డాన్సర్స్ పాల్గొనగా, రకుల్ .. వైష్ణవ్ తేజ్ పై పాటను చిత్రీకరించారు.

చంద్రబోస్ రాసిన ఈ పాట నడక గమ్మత్తుగా అనిపిస్తుంది. మొదటి పదాన్ని ఒత్తి పలుకుతూ .. అందమైన ప్రాసలతో సొగసుగా సాగుతుంది. శ్రేయా ఘోషల్ .. కాలభైరవ ఆలపించిన ఈ పాట ఉత్సాహమనే ఊయల ఊపుతోంది. ఈ సినిమాలోని 7 పాటల్లో ఇదొక మంచి పాట అని చెప్పచ్చు.

More Telugu News