Kolleru Lake: కొల్లేరు అంబాసిడర్‌గా గూడకొంగ.. ప్రకటించిన అటవీశాఖ

  • ప్రపంచంలోని 40 శాతం గూడకొంగలు కొల్లేరులోనే
  • చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యతన్న ప్రతీప్ కుమార్
  • కొల్లేరులో సైన్ బోర్డుల ఏర్పాటు
Pelicon is the Kolleru Lake Ambassador

ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సు అంబాసిడర్‌గా గూడకొంగ (పెలికాన్) ఎంపికైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ (హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఫోర్సెస్) ఎన్. ప్రతీప్ ‌కుమార్ ఏపీ జీవవైవిధ్య మ్యాప్, గూడకొంగ లోగోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరు సరస్సు అంబాసిడర్‌గా గూడకొంగను ఎంపిక చేసినట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూడకొంగల్లో దాదాపు 40 శాతం కొల్లేరులోనే ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత అన్న ప్రతీప్.. కొల్లేరు ప్రాంతంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

రామ్‌సర్ డిక్లరేషన్‌లో భాగంగా ప్రస్తుతం అభయారణ్యంగా, చిత్తడి నేలల ప్రాంతంగా కొల్లేరు సరస్సు ఎంపికైందని తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా వెట్‌ల్యాండ్ మిత్రాస్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కొల్లేరు సరస్సులోని సగం ప్రాంతం అభయారణ్యంగానూ, మరో సగం చిత్తడి నేలల ప్రాంతంగానూ ఉన్నట్టు పేర్కొన్నారు.

More Telugu News