Guntur District: పాల సేకరణలో నిర్లక్ష్యం.. 12 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు

Show Cause Notice Issued to Panchayat Secretaries in Narasaraopet
  • గుంటూరు జిల్లా నరసరావుపేట డివిజన్ కార్యదర్శులకు నోటీసులు
  • కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
  • వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్న డీపీవో
అమూల్ సంస్థ కోసం పాలను సేకరించడం లేదంటూ గుంటూరు జిల్లా నరసరావుపేట డివిజన్‌లో 12 మంది పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఆర్.కేశవరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అమూల్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. కాగా, గ్రామాల్లో రైతుల నుంచి పాల సేకరణ విషయంలో పంచాయతీలకు కార్యదర్శులే నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు ఇవ్వడం నిజమేనని డీపీవో పేర్కొన్నారు.
Guntur District
Narasaraopet
Panchayat Secretary
DPO
Show Cause Notice

More Telugu News