లఖింపూర్ ఖేరీ ఘటనపై రేపు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు

06-10-2021 Wed 22:07
  • రైతులపై నుంచి దూసుకుపోయిన కారు  
  • నలుగురు రైతుల మృతి
  • ఆందోళనకారుల దాడుల్లో మరో నలుగురి మృతి
Supreme Court to here arguments tomorrow in Lakhimpur Kheri incident
ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో రైతులపై నుంచి కారు దూసుకుపోయిన ఘటనలో నలుగురు రైతులతో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్ అట్టుడుకుతోంది. మరోవైపు ఈ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. రేపు ఉదయం 11 గంటలకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపబోతోంది.

ఈ ఘటనకు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రానే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు ప్రయాణిస్తున్న కారు రైతులపై నుంచి దూసుకుపోవడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు చనిపోయారు. ఈ క్రమంలో ఆందోళకారులు జరిపిన ప్రతి దాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు.